21 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-4 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

1. దానశీలం కవి - బమ్మెర పోతన(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి) పద్యం 4 (చదవండి)కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి) ...

1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం 4 (చదవండి)

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై

బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

కారే రాజులు?- రాజ్యముల్ కలుగవే?- గర్వ ఉన్నతిన్ పొందరే?-

వారు ఏరీ- సిరి మూటగట్టుకొని పోవన్ చాలిరే?- భూమిపై-

పేరైనన్  కలదే?- శిబి ప్రముఖులున్ -ప్రీతిన్ -యశఃకాములై-

ఈరే కోర్కులు? -వారలన్ మరచిరే- యిక్కాలమున్- భార్గవా!

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

కారే రాజులు    =  రాజులు కాలేరా?

రాజ్యముల్ కలుగవే?   =   రాజ్యాలు కలిగిలేరా?

సిరి     =    సంపద

పోవంజాలిరే     = పోగలిగారా?

ప్రీతిన్     =   ప్రియంతో

యశఃకాములై    =  కీర్తిని కోరుకున్నవారై

ఇక్కాలం    =  ఈ కాలం

భార్గవా    =   ఆచార్యా

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         ఆచార్యా! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు కలిగి ఉన్నారు. వారు ఎంతో గర్వంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా!


This quiz has been created using the tool HTML Quiz Generator
This quiz has been created using the tool HTML Quiz Generator
This quiz has been created using the tool HTML Quiz Generator
This quiz has been created using the tool HTML Quiz Generator
This quiz has been created using the tool HTML Quiz Generator

20 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-3 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

 1. దానశీలం కవి - బమ్మెర పోతన(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి) పద్యం 3 (చదవండి)ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకట జేకురు భంగింజిత్రముగ దాత కీవియు బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే!పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి) భావయుక్తంగా:(చదవండి)ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములును ఒకట చేకురు భంగిన్చిత్రముగ...

 1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం 3 (చదవండి)

ధాత్రిని హలికునకును సు

క్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం

జిత్రముగ దాత కీవియు

బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే!

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

ధాత్రిని హలికునకును సు

క్షేత్రము బీజములును ఒకట చేకురు భంగిన్

చిత్రముగ దాతకు ఈవియు

పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే!

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

ధాత్రి  =  భూమి

హలికుడు   =  రైతు (హాలికుడు)

సుక్షేత్రం    = మంచి వ్యవసాయ భూమి

బీజములు   = విత్తనాలు

భంగిన్    =    విధంగా

దాత    =    దానం చేసేవాడు

ఈవియు   =  ఈయగల సంపద

పాత్రము    =   అర్హుడైన వ్యక్తి

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడము అరుదైనట్లే, దాతకు దానమీయుటకు తగినంత ధనము, స్వీకరించుటుకు ఉత్తముడైన స్వీకర్త లభించే అదృష్టం అరుదే కదా!


18 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-2 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

 1. దానశీలం కవి - బమ్మెర పోతన(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి) పద్యం 2 (చదవండి)నిజమానతిచ్చితి నీవు మహాత్మక!      మహిని గృహస్థ ధర్మంబునిదియయర్థంబు గామంబు యశమును వృత్తియు      నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు నర్థలోభంబున నర్థి బొమ్మనుటెట్లు?      పలికి లేదనుకంటె బాపమెద్దియెట్టి దుష్కర్ముని నే భరించెదగాని      సత్యహీనుని...

 1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం 2 (చదవండి)

నిజమానతిచ్చితి నీవు మహాత్మక!

      మహిని గృహస్థ ధర్మంబునిదియ

యర్థంబు గామంబు యశమును వృత్తియు

      నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు

నర్థలోభంబున నర్థి బొమ్మనుటెట్లు?

      పలికి లేదనుకంటె బాపమెద్ది

యెట్టి దుష్కర్ముని నే భరించెదగాని

      సత్యహీనుని మోవజాల ననుచు

బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ

సమరమున నుండి తిరుగక జచ్చుకంటె

బలికి బొంకక నిజమున బరుగుకంటె

మానధనులకు భద్రంబు మరియు గలదె

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

నిజము ఆనతిచ్చితివి- నీవు మహాత్మక!

      మహిని -గృహస్థ ధర్మంబును- ఇదియ-

అర్థంబు-కామంబు- యశమును- వృత్తియు-

      ఏ అది ప్రార్థింపను -ఇత్తును అనియు-

అర్థలోభంబునన్ -అర్థిన్-  పొమ్మనుట ఎట్లు?-

      పలికి లేదనుకంటె -పాపము ఎద్ది-

ఎట్టి -దుష్కర్మునిన్- నే భరించెదన్- కాని-

      సత్యహీనుని- మోవజాలను- అనుచు

పలుకదే- తొల్లి- భూదేవి బ్రహ్మతోడ-

సమరమున నుండి- తిరుగక- చచ్చుకంటె-

పలికి బొంకక- నిజమున పరుగుకంటె-

మానధనులకు- భద్రంబు- మరియు గలదె

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

అర్థం     =    ధనం

కామం     = కోరిక

యశము    =  కీర్తి

అర్థలోభంబు  =   ధనంపై దురాశ

అర్థి     =     యాచించి వచ్చినవాడు

దుష్కర్ముడు     =    దుర్మార్గుడు

సత్యహీనుడు    =  సత్యం లేనివాడు  (అసత్యశీలి)

తొల్లి     =    పూర్వం (గతంలో)

బొంకు     =    అబద్దాలాడు

మానధనులు     =   మానమే ధనముగా కలవారు

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         ఓ మహాత్మా! నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. సంపదలు, కోరికలు, కీర్తి, జీవనాధారం వీటిలో ఏది కోరి వచ్చినా ఇస్తానని ప్రకటించి యుంటిని. ఇప్పుడు ధనంపై దరాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చినమాట తప్పుటకన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి దుర్మార్గున్నైనా భరించగలను కాని, ఆడినమాట తప్పినవాడిని మాత్రం మోయలేనని బ్రహ్మతో పలికిందికదా! యుద్దంలో వెనుదిరిగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడమూ మానధనులైనవారికి మేలైన మార్గాలు.


Latest Updates

Class 10

View more »

Class 9

View more »

Class 8

View more »

Download Text Books n others

View more »

Top