20 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-3 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

 1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం 3 (చదవండి)

ధాత్రిని హలికునకును సు

క్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం

జిత్రముగ దాత కీవియు

బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే!

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

ధాత్రిని హలికునకును సు

క్షేత్రము బీజములును ఒకట చేకురు భంగిన్

చిత్రముగ దాతకు ఈవియు

పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే!

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

ధాత్రి  =  భూమి

హలికుడు   =  రైతు (హాలికుడు)

సుక్షేత్రం    = మంచి వ్యవసాయ భూమి

బీజములు   = విత్తనాలు

భంగిన్    =    విధంగా

దాత    =    దానం చేసేవాడు

ఈవియు   =  ఈయగల సంపద

పాత్రము    =   అర్హుడైన వ్యక్తి

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకడము అరుదైనట్లే, దాతకు దానమీయుటకు తగినంత ధనము, స్వీకరించుటుకు ఉత్తముడైన స్వీకర్త లభించే అదృష్టం అరుదే కదా!


0 comments:

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top