22 May 2021

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-8 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

 పద్యం  8 (చదవండి)

దనుజ లోకనాథు దయిత వింధ్యావళి

రాజవదన మదమరాళ గమన

వటుని కాళ్లు గడుగ వర హేమఘటమున

జలము దెచ్చె భర్త సన్న యెఱిగి

పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


భావయుక్తంగా:(చదవండి)

దనుజలోకనాథు దయిత- వింధ్యావళి-

రాజవదన- మదమరాళ గమన-

వటుని కాళ్లు కడుగన్- వర హేమఘటమున-

జలము తెచ్చె- భర్త సన్న- ఎఱిగి

పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)


కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

దనుజులు     =  రాక్షసులు 

నాథుడు     =  ప్రభువు (రాజు)

దయిత     =  భార్య

రాజు         =  చంద్రుడు

రాజవదన      =  చంద్రుని వంటి ముఖము కలది

మద మరాళం    = రాజహంస

గమన     =  నడక గలది

వటుడు     =  బ్రహ్మచారి

హేమఘటము    =  బంగారు చెంబు

సన్న      =  సంజ్ఞ  (సైగ)

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         దానమీయడానికి సిద్దపడిన ఆ సమయంలో చంద్రబింబం వంటి ముఖము కలిగి, రాజహంసవంటి నడక కలిగిన ఆ రాక్షసరాజు భార్య వింధ్యావళి, భర్త సైగను గమనించి ఆ బ్రహ్మచారి కాళ్లు కడిగి దానం చేయడానికై శ్రేష్ఠమైన బంగారు చెంబుతో నీళ్లు తీసుకొని వచ్చింది.


0 comments:

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top