May 10, 2016

అ, ఆ లతో Indefinite Article a or an తెలుగులో




అ, ఆలతో articlesలోa లేదా an
            హలో పిల్లలూ అ, ఆలతో Articles నేర్చుకుందామా? అయితే సరే చదవండి. English language లో articles కు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఉపయోగించడంలో confuse అవుతుంటారు. తెలుగు వర్ణమాల (అ,ఆలు) వస్తే indefinite articles అనగా a or an ఉపయోగించడం సులువే.
          Articlesనే Determiners అని కూడా పిలుస్తారు. ఇవి Adjective లుగా పనిచేస్తాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. 1. Indefinite Article (a లేదా an) మరియు 2. Definite Article (the).
1.    Indefinite Article (a లేదా an):
A లేదా an లను ఉపయోగించుటకు తెలుగు వర్ణమాల(అ,ఆలు) వస్తే ఉపయోగించడం సులువు అవుతుంది. ఎందుకంటే Indefinite Articles అనేవి sound systemపై ఆధారపడి ఉపయోగించబడతాయి.
తెలుగులో శబ్దానికి అక్షరానికి సంబంధం ఉంటుంది. కానీ Englishలో  అక్షరానికి శబ్దానికి సంబంధం ఉండకపోవచ్చు. ఉదాహరణకి success లో మొదటి మరియు చివరి ‘s’లు స్అనే ఒకే శబ్దాన్ని ఇస్తాయి. అలాగే అదే పదంలోరెండవ ‘c’ కూడా అదే శబ్దాన్ని ఇస్తుంది. కానీ మొదటి ‘c’ మాత్రం క్అనే శబ్దాన్ని చేస్తుంది. కాబట్టి తెలుగు వర్ణమాల శబ్దాలతో English articlesలో a లేదా an లను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
తెలుగులో అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ లు చేసే శబ్దాలను Vowel Sounds అంటాము. మిగతా అక్షరాలు క నుండి ఱ వరకు చేసే శబ్దాలు Consonant Sounds గా గుర్తించాలి. గుర్తుంచుకోండి వీటిని శబ్దాలుగా మాత్రమే గుర్తుంచుకోవాలి కానీ అక్షరాలుగా కాదు.
          A లేదా an లను singular common countable noun ముందు ఉపయోగించాలి. ఎందుకంటే A లేదా an లు ఒకఅనే అర్ధాన్ని ఇస్తాయి. కావున plural noun ముందు అలాగే proper noun ముందు a లేదా an లను ఉపయోగించకూడదు.
Ruchitha is a doctor. (correct)
They are a doctors. (wrong)
Ramanna is a student. (correct).
A Ramanna is a student. (wrong)

            Vowel Sound తో (అ నుండి ఔ శబ్దాలతో) మొదలయ్యే singular common countable noun ముందు ‘an’ ఉపయోగించాలి. Consonant Sound తో (అ నుండి ఔ కాకుండా మిగతా శబ్దాలతో) మొదలయ్యే singular common countable noun ముందు ‘a’ ఉపయోగించాలి.
ఉదాహరణ:
1.      Anil is a teacher. (Teacher - టీచర్ అని Consonant Soundతో పలికే singular common countable noun)
2.      Anil is an English teacher. (English teacher – ఇంగ్లీష్ టీచర్ అని Vowel Soundతో పలికే singular common countable noun)
3.      This is an article on grammar. (Article – ర్టికల్ అని Vowel Soundతో పలికే singular common countable noun)
4.      Those are ___ mangoes.(mangoes is plural noun and in general, so indefinite article ఉపయోగించరాదు)
మరి మీరూ ప్రయత్నిస్తారా?
1.        You have ………….. old book. (ల్డ్ బుక్)
2.        A hen is ………….. bird. (ర్డ్)
3.        A rose is …………… beautiful flower. (బ్యూటీఫుల్ ఫ్లవర్)
4.        There is …………. one eyed beggar. (నైడ్ బెగర్)
5.        John is …………… European. (యూరోపియన్)
6.        Shravan works in ………… bank. (బ్యాంక్)
7.        We love to have ……… colour pencils. (plural noun)
8.        My brother studied in ………… university. (యూనివర్సటి)
9.        We need ………. umbrella when it rains. (అంబ్రిలా)
10.     ……. orange a day keeps you healthy. (రెంజ్)
11.     A dog is …….. animal. (ఆనిమల్)
12.     Are you …….. good student? (గుడ్ స్టుడెంట్)
13.     I am …… optimist. (ప్టిమిస్ట్)
14.     Seven days make  ……. Week. (వీక్)
15.     Would you like …….. orange. (రెంజ్)
16.     ........ ewe is a female sheep. (ewe-యూ)
17.     Yours is …… unique answer. (యూనిక్ ఆన్సర్)
18.     My brother is …….. cardiologist. (కార్డియాలోజిస్ట్)
19.     Would you help me to find ……. AC hotel. (సీ హోటల్)
20.     Mr. Rajender is ……… M.L.A. (మ్.ఎల్.ఏ.)







singular noun
plural noun
doctor
doctors
teacher
teachers
man
men
foot
feet
child
children
eye
eyes


















proper noun
common noun
Kohli
cricketer
Srujana
doctor
Harinath
teacher
Shivani
engineer
Vishal
student
   Nani
actor




Countable noun
Uncountable noun
Noun phrase
Cups
Tea
Two cups of tea
Bowl
Sugar
A bowl of sugar
Kilogram
Rice
Five kilograms of rice
Litre
Oil
Two litres of oil
Log
Wood
Four logs of wood
Bottle
Water
Three bottles of water

Follow us on Facebook

Latest Updates

YouTubeVideos

Class 10

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Top